మహిళా సంఘాల భవనాల నిర్మాణానికి భూమి పూజ
JN: రఘునాథపల్లి మండలంలోని సోమయ్యకుంట తండా, వేపల గడ్డ తండాలో మహిళా సంఘాల భవనాల నిర్మాణానికి గ్రంధాలయ ఛైర్మన్ రాంబాబు భూమి పూజ చేశారు. మహిళా సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని, ప్రభుత్వ సంక్షేమ పథకాలను మహిళలు సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా లబ్ధి పొందాలని ఛైర్మన్ రాంబాబు అన్నారు. స్థానిక ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ శ్రేణులు ఉన్నారు.