లయన్స్ క్లబ్ ఆద్వర్యంలో వ్యాసరచన పోటీలు
NZB: లయన్స్ క్లబ్ ఆఫ్ ఇందూర్ ఆధ్వర్యంలో శుక్రవారం నిజామాబాద్ నగరంలోని శంకర్ భవన్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జాతీయ సమగ్రత అనే అంశంపై వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో గెలుపొందిన విజేతలకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు అందజేశారు. లయన్స్ క్లబ్ అధ్యక్షుడు అబ్బాయి లింబాద్రి మాట్లాడుతూ.. విద్యార్థులు క్రమశిక్షణతో ముందుకు సాగాలన్నారు.