ఘనంగా ఎంపీపీ పాఠశాల వార్షికోత్సవం
SKLM: నందిగాం మండలం రాంపురం ఎంపీపీ పాఠశాల వార్షికోత్సవం వేడుకగా జరిగింది. ఈ సందర్భంగా అదే గ్రామానికి చెందిన ఉపాధ్యాయులు తమ ఔదార్యాన్ని చాటుకున్నారు. పాఠశాల అభివృద్ధి కోసం వారు రూ. 55 వేల విరాళం అందజేశారు. ఈ నిధులతో పాఠశాలలో సరస్వతీ దేవి విగ్రహం, సౌండ్ సిస్టమ్‌ను ఏర్పాటు చేసినట్లు యాజమాన్యం తెలిపింది. ఎంఈఓలు నరసింహులు, చిన్నారావు తదితరులు పాల్గొన్నారు.