బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం అందజేత
ఆదిలాబాద్ పట్టణానికి చెందిన సజ్జనపు సాయి అనారోగ్యంతో బాధపడుతున్నాడు. విషయం తెలుసుకున్న యువజన కార్మిక స్వర్ణకారుల సంఘం సభ్యులు బాధిత కుటుంబానికి అండగా నిలిచారు. వైద్యం కోసం రూ. 37,250 అందజేసి ధైర్యంగా ఉండమని భరోసా కల్పించారు. సభ్యులు శ్రీనివాస్, విజయ్ కుమార్, రవి శాస్త్రి, యువకులు తదితరులు పాల్గొన్నారు.