త్రివిధ దళాలకు సంఘీభావం తెలిపిన ఉపాధి హామీ కూలీలు

KMR: ఎల్లారెడ్డి మండలంలోని భిక్కనూరు గ్రామంలో ఉపాధి హామీ కూలీలు ఆ గ్రామ ఉప సర్పంచ్ గోనె శ్రీకాంత్ ఆధ్వర్యంలో జమ్మూ కాశ్మీర్ పహల్గాం ఉగ్రదాడికి ప్రతి చర్యగా భారత సైన్యం నిర్వహించిన ఆపరేషన్ సింధూర్‌కు మద్దతుగా భారత్ సైన్యానికి కృతజ్ఞతలు తెలుపుతూ కార్యక్రమం నిర్వహించారు. అంతకు ముందు రెండు నిమిషాల పాటు పహల్గావ్ యాత్రికుల మరణానికి నివాళిగా మౌనం పాటించారు.