UPDATE: నార్సింగి పీఎస్ ఎదుట జాగృతి శ్రేణుల నిరసన
RR: నార్సింగి పోలీస్ స్టేషన్ ఎదుట తెలంగాణ జాగృతి నాయకులు, కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. మూసీ ఆక్రమణలపై నిరసన తెలుపుతున్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అరెస్టును నిరసిస్తూ పీఎస్ ఎదుట బైఠాయించారు. కవితను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.