టిడ్కో గృహాలలో మౌలిక వసతులు కల్పించండి

గుంటూరు: పొన్నూరు పట్టణంలోని నిడుబ్రోలులో ఉన్న టిడ్కో గృహాలలో త్రాగునీరు, విద్యుత్, పారిశుధ్యం, తదితర అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలని శనివారం పొన్నూరు మున్సిపల్ కమిషనర్ నయీమ్ అహ్మద్‌కు తెలుగుదేశం, జనసేన పార్టీల శ్రేణులు వినతిపత్రం ఇచ్చారు. కనీస మౌలిక సదుపాయాలు లేక 2,369 మంది టిడ్కో గృహ వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వారి సమస్యను పరిష్కరించాలని టీడీపీ, జనసేన కార్యకర్తలు కోరారు.