చేబ్రోలులో మద్యం తాగి యువకుడి మృతి

GNTR: చేబ్రోలు పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ యువకుడు మరణించాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఒడిశాలోని గంజాం జిల్లా ఫాసి గ్రామానికి చెందిన మిధున్ మండల్ (30) తన భార్యతో కలిసి స్థానిక మిల్లులో పనిచేస్తున్నాడు. మద్యానికి బానిసయ్యాడు. మూడు రోజులుగా తిండి లేకుండా మద్యం మాత్రమే తాగడంతో ఆదివారం మరణించాడు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.