VIDEO: మండలంలో ఎడతెరిపి లేకుండా వర్షాలు

ADB: నార్నూర్ మండలంలో గత రెండు రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు ఉండడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. రోజంతా ఎండగా ఉంటూ ఒక్కసారిగా వాతావరణం చల్లబడుతోంది. పక్క మండలమైన గాదిగూడలో సైతం వాన పడుతోంది. ఈ మేరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.