సీఐటీయూ మహాసభలకు రూ.10,000 విరాళం
విశాఖలో ఈనెల 31 నుంచి జనవరి 4 వరకు జరిగే అఖిలభారత సీఐటీయూ మహాసభలకు అచ్యుతాపురం SEZ ముఠా కార్మికులు రూ.10,000 విరాళాన్ని గురువారం అందజేశారు. సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్. రాము మాట్లాడుతూ.. కార్మికుల సమస్యల పరిష్కారానికి సీఐటీయూ నిరంతరం కృషి చేస్తుందన్నారు. మహాసభలకు దేశ విదేశాల నుంచి 1500 మంది ప్రతినిధులు హాజరవుతున్నట్లు పేర్కొన్నారు.