రౌడీ షీటర్లకు కౌన్సెలింగ్ ఇచ్చిన ఎస్సై
KDP: సిద్ధవటం పోలీస్ స్టేషన్‌లో మంగళవారం రౌడీషీటర్లకు కౌన్సెలింగ్ ఇచ్చినట్లు సిద్ధవటం SI మహమ్మద్ రఫీ తెలిపారు. SP ఆదేశాల మేరకు పలు వివాదాల్లో ఉన్న రౌడీ షీటర్లు గ్రామాల్లో ఎలాంటి సమస్యలు సృష్టించకుండా ప్రశాంతంగా ఉండాలన్నారు. గ్రామాల్లో ఎటువంటి ఘర్షణ వాతావరణం తలెత్తకుండా కక్షలు లేకుండా ప్రశాంతమైన జీవితాన్ని గడపాలని రౌడీ షీటర్లను ఎస్సై హెచ్చరించారు.