VIDEO: నకిలీ బంగారంతో మోసం.. ముగ్గురు అరెస్ట్
KDP: నకిలీ బంగారు చైన్లకు 916 హాల్ మార్క్ వేసి కుదవపెట్టి మోసాలకు పాల్పడుతున్న ముఠాను బుధవారం కడప పోలీసులు అరెస్ట్ చేశారు. రంజన, మంజునాథ, సురేంద్ర అనే ముగ్గురు వ్యక్తులు ఒక వ్యాపారి వద్ద నకిలీ చైన్లు పెట్టి రూ. 4.20 లక్షలు కాజేశారు. వీరి నుంచి ఒక కారు, బైక్, రూ. 2.30 లక్షల నగదు, నకిలీ ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ ప్రసాదరావు తెలిపారు.