గ్యాస్ లీక్.. తప్పిన ప్రమాదం
మహారాష్ట్ర పాల్ఘర్ జిల్లాలోని MIDC డీ-జోన్ పారిశ్రామిక ప్రాంతంలో ఉన్న కెమికల్స్ ఫ్యాక్టరీలో ఒలియం గ్యాస్ లీక్ ఘటన జరిగింది. మ. 2 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. దీంతో అగ్నిమాపక దళం, పోలీసు, విపత్తు నిర్వహణ బృందాలు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని లీక్ నియంత్రణ చర్యలు చేపట్టాయి. సమీపంలోని సాల్వాడ్, పస్థల్ గ్రామాల ప్రజలను అప్రమత్తం చేసి, జాగ్రత్తలు పాటించాలని సూచించారు.