రేపటి నుంచి ఏయూ డిగ్రీ పరీక్షలు

రేపటి నుంచి ఏయూ డిగ్రీ పరీక్షలు

VSP: ఆంధ్ర విశ్వవిద్యాలయం పరిధిలో డిగ్రీ పరీక్షలు ఈ నెల 23 నుంచి నిర్వహిస్తామని రిజిస్ట్రార్ ధనుంజయ రావు ఒక ప్రకటనలో తెలిపారు. బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఏ, బీసీఏ ద్వితీయ, నాల్గవ సెమిస్టర్ పరీక్షలు జరుగుతాయన్నారు. విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లోని 180 కళాశాలల నుంచి సుమారు 51,400 మంది విద్యారులు జంబ్లింగ్ విధానంలో పరీక్షలకు హాజరవుతారన్నారు.