AIలో గోదావరిఖని విద్యార్థినికి గోల్డ్ మెడల్
PDPL: గోదావరిఖని ఫైవింక్లైన్‌కు చెందిన విద్యార్థిని కైలాస మోనా AIలో బంగారు పతకం సాధించింది. హుజూరాబాద్ కిట్స్ ఇంజినీరింగ్ కళాశాలలో చదువుతున్న ఈమె బీటెక్(ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషీన్ లెర్నింగ్) విభాగంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి గోల్డ్ మెడల్‌కు ఎంపికయ్యింది. త్వరలో జరగనున్న విశ్వవిద్యాలయ స్నాతకోత్సవంలో మోనా ఈ బంగారు పతకాన్ని అందుకోనుంది.