ప్రాజెక్టులకు భారీగా వరద నీరు.. గేట్లు తెరిచిన అధికారులు

BDK: చర్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరడంతో ప్రాజెక్టు నిండుకుండలా మారింది. ప్రాజెక్టు 10 గేట్లు తెరిచి 23 వేల క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి వదిలారు. కిన్నెరసాని ప్రాజెక్టుకు కూడా వరద నీరు వస్తుండటంతో సోమవారం రాత్రి 10 గంటలకు రెండు గేట్లు ఎత్తి 8 వేల క్యూసెక్కుల నీటిని కిన్నెరసాని నదిలోకి వదిలారు.