'పెండింగ్లో ఉన్న వేతనాలు వెంటనే చెల్లించాలి'
KDP: పని భారం తగ్గించాలని, పెండింగ్లో ఉన్న వేతనాలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ పులివెందుల ఆర్పీలు గురువారం నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. మెప్మా కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టిన వారు, నిరంతరం కొత్త నిబంధనలతో అధికారులు వేధిస్తున్నారని, పని ఒత్తిడి వల్ల తమ ఆరోగ్యం దెబ్బతింటోందని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం మున్సిపల్ కమిషనర్‌కు వినతిపత్రం అందజేశారు.