రేషన్ సరుకులు పంపిణీ చేసిన MLA
VZM: మోంథా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పునరావాస కేంద్రాలను నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగ మాధవి గురువారం సందర్శించారు. ఈ మేరకు రఘుమండ, బంటుపల్లి, పేడాడ గ్రామాల్లో పర్యటించి బాధితులకు రేషన్ సరుకులు పంపిణీ చేశారు. అనంతరం తుఫాన్ ప్రభావిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని, సహాయ పథకాలు త్వరగా అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.