విద్యుత్ షాక్‌తో కార్మికుడి మృతి
NGKL: కోడేరు మండల పరిధిలోని ఖానాపూర్ గ్రామానికి చెందిన ఆది బాలస్వామి గ్రామంలో పారిశుద్ధ్య కార్మికుడిగా విధులు నిర్వహిస్తున్నాడు. పారిశుద్ధ్య పనుల్లో భాగంగా ఆదివారం గ్రామంలోని ట్రాన్స్‌ఫార్మర్ చుట్టూ ఉన్న చెట్లను తొలగించేందుకుగాను శుభ్రం చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ వైరు తగిలి కరెంట్ షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందాడని భార్య మైసమ్మ తెలిపారు.