మూడు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులకు నిధులు మంజూరు

NLG: నల్గొండ నియోజకవర్గంలో SLBC కాల్వ-హై లెవెల్ కాల్వ ద్వారా 4,232 ఎకరాలకు సాగునీరు అందించేందుకు ప్రభుత్వం మూడు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులకు రూ.44 కోట్లు మంజూరు చేసింది. కనగల్ మండలం పోనుగోడు లిఫ్ట్ ఇరిగేషన్‌కు రూ. 683.50 లక్షలు, నర్సింగ్ బట్ల-దోమలపల్లి రూ.1,695 లక్షలు, నల్గొండ పట్టణ సమీపంలోని బక్కతాయకుంట వద్ద లిఫ్ట్ ఇరిగేషన్‌కు రూ.2,022 లక్షల నిధులుగా మంజూరు చేశారు.