మాదారం-3 ఇంక్లెన్ సర్పంచ్‌గా చందనాల రవికుమార్
మంచిర్యాల జిల్లా తాండూరు మండలం మాదారం-3 ఇంక్లెన్ గ్రామపంచాయతీ సర్పంచ్‌గా రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికల ఫలితాలలో కాంగ్రెస్ అభ్యర్థి చందనాల రవికుమార్ విజయం సాధించారు. సమీప ప్రత్యర్థిపై 15 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. దీంతో రవికుమార్ మద్దతుదారులు సంతోషం వ్యక్తం చేశారు. గ్రామ అభివృద్ధే ధ్యేయంగా పని చేస్తానని రవికుమార్ తెలిపారు.