చెన్నేకొత్తపల్లిలో సీసీ రోడ్డు ప్రారంభించిన ఎమ్మెల్యే
ATP: చెన్నేకొత్తపల్లిలోని మోడల్ పాఠశాల, కస్తూరిబా బాలికల పాఠశాల సమీపంలో రూ.12 లక్షల నిధులతో నిర్మించిన సీసీ రోడ్డును ఎమ్మెల్యే పరిటాల సునీత ప్రారంభించారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు, అధికారులు, స్థానిక నాయకులతో కలిసి ఆమె ఈ రోడ్డును ప్రారంభించారు. ఈ రోడ్డు నిర్మాణం విద్యార్థులకు సౌకర్యంగా ఉంటుందని తెలిపారు.