అనాథ ఆడపిల్లలకు బీఆర్ఎస్ ఆర్థిక సాయం

SRPT: తుంగతుర్తికి చెందిన రాములమ్మ మూడేళ్ల క్రితం క్యాన్సర్‌తో మృతి చెందగా, ఆమె భర్త వెంకన్న ఇటీవల అనారోగ్యంతో కన్నుమూశారు. దీంతో అనాథలైన వారి ఇద్దరు ఆడపిల్లలకు బీఆర్ఎస్ నాయకులు అండగా నిలిచారు. మంగళవారం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రూ.5వేల ఆర్థిక సాయం అందజేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సీతయ్య, రమేష్, శ్రీను, రవికుమార్ పాల్గొన్నారు.