సారవలో సభ్యత్వ నమోదు కార్యక్రమం
W.G: నరసాపురం మండలం సారవలో ఆదివారం డీసీఎంఎస్ ఛైర్మన్ చాగంటి మురళీ కృష్ణ, లక్ష్మణేశ్వరం సొసైటీ ఛైర్మన్ గంటి పార్థసారథి ఆధ్వర్యంలో ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. మురళీ కృష్ణ మాట్లాడుతూ.. పార్టీ కోసం అహర్నిశలు శ్రమించే కార్యకర్తలకు అండగా ఉండటమే కాకుండా, వారికి ఇన్సూరెన్స్ వంటి భద్రతను కల్పించడమే ఈ క్రియాశీలక సభ్యత్వ లక్ష్యమని అన్నారు.