VIDEO: వంగర ఇన్‌ఛార్జ్ తహసీల్దార్ సస్పెండ్

VZM: వంగర ఇన్‌ఛార్జ్ తాహసీల్దార్‌గా విధులను నిర్వహిస్తున్న డీప్యూటీ తహసీల్దార్ హెచ్. రమణారావును జిల్లా కలెక్టర్ అంబేద్కర్ సస్పెండ్ చేస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. రమణారావు విధి నిర్వహణలో ఉండగా, కార్యాలయంలోనే మద్యం సేవించినట్లు పలు పత్రికల్లో కథనాలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో ఆరోపణలు నిజమని నిర్ధారణ కావడంతో కలెక్టర్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.