తుఫాను ప్రభావిత పంటలను పరిశీలించిన అధికారులు
NGKL: నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గం నడింపల్లి గ్రామంలో తుఫాను ప్రభావిత పంటలను అధికారులు శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా BJP మండల అధ్యక్షురాలు జ్యోతి మాట్లాడుతూ.. తుఫాను వచ్చి మూడు రోజులు గడుస్తున్నా కూడా అధికారులు ప్రజాప్రతినిధులు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం దౌర్భాగ్యం అన్నారు. వంట నష్టపోయిన రైతులకు వెంటనే నష్టపరిహారం చెల్లించాలన్నారు.