ఇండ్ల నిర్మాణాలను పరిశీలించిన అదనపు కలెక్టర్

BDK: మణుగూరు మున్సిపాలిటీలో నూతనంగా నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను గురువారం అదనపు కలెక్టర్ వేణుగోపాల్, స్థానిక అధికారులతో కలిసి పరిశీలించారు. త్వరిగతిన ఇండ్ల నిర్మాణాలను పూర్తి చేయాలని, పనుల నాణ్యత పై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో తాహాసీల్దార్ రాఘవరెడ్డి, ఎంపీడీవో శ్రీనివాస్ పాల్గొన్నారు.