VIDEO: కదిరిలో అన్నదాతల ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించిన ఎమ్మెల్యే

సత్యసాయి: కదిరిలో కూటమి ప్రభుత్వ ‘అన్నదాత సుఖీభవ’ పథకం కింద నగదు జమ సందర్భంగా ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ ట్రాక్టర్ ర్యాలీని నిర్వహించారు. ఐదు మండలాల నుంచి 500 ట్రాక్టర్లతో రైతులు పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే ఎంఎస్ పార్థసారథి, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి పవన్ కుమార్ రెడ్డి హాజరయ్యారు. కూటమి నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు.