కోటగుళ్లలో నందీశ్వరుని వార్షికోత్సవ వేడుకలు

BHPL: కాకతీయుల కళాక్షేత్రం శ్రీ భవాని సహిత గణపేశ్వరాలయం కోటగుళ్లలో శ్రావణమాసం చివరి సోమవారం నందీశ్వరుని 2వ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఉదయం గణపతి పూజతో అర్చకులు పూజా కార్యక్రమాలను ప్రారంభించారు. తర్వాత నందీశ్వరునికి, గణపేశ్వరునికి అభిషేకం నిర్వహించి అలంకరించారు. అనంతరం పూజలు అనంతరం భక్తులకు ఆశీర్వచనాలు అందజేశారు.