జిల్లాలో తెలంగాణ పబ్లిక్ పాఠశాలలు

MBNR: జిల్లాలో తెలంగాణ పబ్లిక్ స్కూల్స్‌ని ఏర్పాటు చేయనున్నట్లు తెలంగాణ విద్యా కమిషన్ ఛైర్మన్ ఆకునూరి మురళి వెల్లడించారు. మంగళవారం జిల్లా పర్యటనలో భాగంగా బాలానగర్ మండల పరిధిలో పలు ప్రభుత్వ పాఠశాలలను తనిఖీ చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయితో కలెక్టరేట్‌లో సమావేశమయ్యారు. మండలానికి రెండు, మూడు పాఠశాలలను ఎంపిక చేయాలన్నారు.