బాల్య వివాహాలు చేస్తే కఠిన శిక్షలు
SRPT: బాల్య వివాహాలు చట్టరీత్యా నేరమని, వీటిని ప్రోత్సహిస్తే కఠిన చర్యలు తప్పవని అదనపు జూనియర్ సివిల్ జడ్జి అపూర్వ రవళి హెచ్చరించారు. శనివారం చివ్వేంల కేజీబీవీలో నిర్వహించిన ‘బాల వివాహ ముక్త్ భారత్’ సదస్సులో ఆమె మాట్లాడారు. అమ్మాయిలకు 18, అబ్బాయిలకు 21 ఏళ్లు నిండాకే పెళ్లి చేయాలని, చదువు, ఉద్యోగం తర్వాతే వివాహం చేసుకోవాలని విద్యార్థులకు సూచించారు.