రేపు వందేమాతరం గేయం సామూహిక ఆలాపన
MNCL: వందేమాతరం గేయం రచించి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ నెల 7న ఉదయం 10 గంటలకు నస్పూర్‌లోని కలెక్టరేట్ ఆవరణలో సామూహిక గీతాలాపన నిర్వహించనున్నట్లు జిల్లా అదనపు కలెక్టర్ పి. చంద్రయ్య తెలిపారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ, ఎయిడెడ్, గుర్తింపు పొందిన ప్రైవేట్ పాఠశాలలలో సామూహిక గీతాలాపన నిర్వహించాలని సూచించారు.