ఎక్స్‌లో కీలక మార్పు
సోషల్ మీడియా ప్లాట్‌ఫాం 'X'లో కీలక మార్పు చోటుచేసుకుంది. డైరెక్ట్ మెసేజెస్ స్థానంలో 'ఎక్స్ చాట్'ను ప్రవేశపెట్టారు. ఈ సదుపాయాన్ని తొలుత బీటా వెర్షన్‌లో కొంతమంది వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ఎలాన్ మస్క్ వెల్లడించారు. ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్, భారీ ఫైల్ ట్రాన్స్‌ఫర్, వానిషింగ్ మోడ్ వంటి ఫీచర్లతో దీనిని రూపొందించినట్లు తెలిపారు.