VIDEO: ఘోర ప్రమాదం.. నలుగురు మృతి
MDK: రోడ్డు ప్రమాదంలో నలుగురు మరణించిన ఘటన మెదక్ జిల్లా పెద్దశంకరంపేట PS పరిధిలోని కింగ్స్ మెన్ దాబాకు దగ్గరలో నేషనల్ హైవేపై ఈరోజు రాత్రి జరిగింది. గుర్తుతెలియని వాహనం బైక్‌ను ఢీకొట్టగా భార్యాభర్తలు, ఇద్దరు పిల్లలు అక్కడికక్కడే మరణించారు. వీరు HYD వైపు నుంచి ఓటేయడానికి కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలం మాగి గ్రామానికి వెళ్తున్నట్లు తెలిసింది.