మండల సమావేశాల తేదీలు ఖరారు..!

మండల సమావేశాల తేదీలు ఖరారు..!

అన్నమయ్య: రాయచోటి నియోజకవర్గంలోని పలు మండలాల్లో సర్వసభ్య సమావేశాలకు తేదీలు ఖరారయ్యాయి. గాలివీడు మండల సమావేశం ఈనెల 13న, రామాపురం మండల సమావేశం 17న, సంబేపల్లె మండల సమావేశం 18న ఉదయం 11 గంటలకు నిర్వహించనున్నారు. ఆయా మండలాల ఎంపీడీఓలు ఈ వివరాలను వెల్లడించారు. ఎంపీటీసీలు, సర్పంచులు, వివిధ శాఖల అధికారులు తప్పనిసరిగా హాజరై మండల అభివృద్ధి, సమస్యలపై చర్చించాలని కోరారు.