భక్తి భావాన్ని పెంచిన కళా బృందాల ప్రదర్శనలు

భక్తి భావాన్ని పెంచిన కళా బృందాల ప్రదర్శనలు

TPT: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం రాత్రి జరిగిన గరుడ వాహన సేవలో వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన 15 కళాబృందాలకు చెందిన 275 మంది కళాకారులు ప్రదర్శనలు ఇచ్చారు. కర్ణాటకలోని బెంగళూరుకు చెందిన బంజారా నృత్యం, కథకళి ప్రదర్శనలతో పాటు, పాండిచ్చేరి కారైకల్‌కు చెందిన యువతుల కావడి మైలాసం విశేషంగా ఆకట్టుకుంది.