మానవత్వాన్ని చాటుకున్న జనసేన నేత
ATP: జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు, అహుడ ఛైర్మన్ టీసీ వరుణ్ మానవత్వాన్ని చాటుకున్నారు. మరూరు టోల్‌గేట్ హంపాపురం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన ముస్లిం మైనార్టీ కుటుంబాన్ని ఆయన తన వాహనం ఆపి ఆదుకున్నారు. హుటాహుటిన అంబులెన్స్‌లను పిలిపించి, గాయపడిన వారిని అనంతపురం సర్వజన ఆస్పత్రికి తరలించి, మెరుగైన సేవల కోసం ఏర్పాట్లు చేశారు.