మహిళా పోలీస్ స్టేషన్‌ను సందర్శించిన స్కూల్ విద్యార్థులు

మహిళా పోలీస్ స్టేషన్‌ను సందర్శించిన స్కూల్ విద్యార్థులు

CTR: క్యామ్‌ఫర్డ్ స్కూల్‌కు చెందిన విద్యార్థులు మహిళా పోలీస్ స్టేషన్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా మహిళా పీఎస్ ఎస్సై కరీమున్నిసా విద్యార్థులకు పోలీస్ స్టేషన్‌లో జరిగే రోజువారీ విధుల గురించి చక్కగా వివరించారు. అలాగే నేరాల నివారణ, వ్యక్తిగత భద్రతపై విద్యార్థుల్లో అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.