ప్రభుత్వ ఆసుపత్రిలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు...!
KMR: మద్నూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో తాజాగా ఇద్దరికి కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేసినట్లు డాక్టర్ ఆనంద్ జాదవ్ తెలిపారు. జిల్లాలోనే అత్యధికంగా ఆపరేషన్లు చేస్తూ ఈ ఆసుపత్రి ప్రత్యేక గుర్తింపు పొందింది. ఏడాదిలో 100కు పైగా ఆపరేషన్లు పూర్తి చేసి రికార్డు సృష్టించింది. ప్రతి వారం ఇక్కడ శస్త్రచికిత్సలు నిర్వహిస్తున్నామని తెలిపారు