దివంగత ఎస్సై చంద్రశేఖరకు ఘన నివాళి
KNR: ఇటీవల అకాల మరణం చెందిన ఎస్సై చంద్రశేఖర్ స్మారకార్థం జిల్లా పోలీస్ కమిషనరేట్‌లో బుధవారం సంతాప సభ నిర్వహించారు. సీపీ గౌష్ ఆలం పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం అధికారులు రెండు నిమిషాలు మౌనం పాటించారు. చంద్రశేఖర్ సేవలను గుర్తుచేసుకున్న సీపీ, బాధిత కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు పోలీస్ అధికారులు పాల్గొన్నారు.