VIDEO: చెరువులో దూకి వృద్ధుడు ఆత్మహత్య
HNK: అనారోగ్యంతో బాధపడుతున్న ఓ వృద్ధుడు మనస్థాపం చెంది చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై రాజు తెలిపారు. కమలాపురం మండల కేంద్రానికి చెందిన రాజమౌళి(75) కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ.. ఇవాళ సాయంత్రం గ్రామ శివారులోని చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు పేర్కొన్నారు. మృతుడి కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు మృతదేహాన్ని మార్చురికి తరలించినట్లు ఎస్సై వెల్లడించారు.