VIDEO: రెవెన్యూ సమస్యల మీద అధిక ఫిర్యాదులు

VIDEO: రెవెన్యూ సమస్యల మీద అధిక ఫిర్యాదులు

AKP: నర్సీపట్నం ఆర్డీవో కార్యాలయంలో సోమవారం ప్రజాఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డీవో రమణ ప్రజల వద్ద నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. భూ సమస్యలు, రెవెన్యూ సమస్యల మీద అత్యధికంగా 12 దరఖాస్తులు ప్రజలు అందజేసినట్లు అధికారులు తెలిపారు. వచ్చిన ఫిర్యాదులను వేగవంతంగా పరిష్కరించాలని ఆర్డీవో పేర్కొన్నారు.