రేపు స్కూల్‌కి కాలేజీలకు సెలవు

W.G: భారీ వర్షాల నేపథ్యంలో తూర్పు గోదావరి జిల్లాలో రేపు అన్ని విద్యాసంస్థలు, అంగన్వాడీ కేంద్రాలకు కలెక్టర్ ప్రశాంతి సెలవు ప్రకటించారు. 'అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లు, ఇంటర్, డిగ్రీ కాలేజీలు, అంగన్వాడీ కేంద్రాలకు రేపు తప్పనిసరిగా సెలవు ఇవ్వాలి. భారీ వర్షాలు కురుస్తుండటంతో ప్రజలు సురక్షిత ప్రాంతాల్లో ఉండాలి' అని కలెక్టర్ పేర్కొన్నారు.