'అంగన్వాడీల సంక్షేమానికి కూటమి కట్టుబడి ఉంటుంది'
BPT: అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్లు, చిరు ఉద్యోగుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని బాపట్ల ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ అన్నారు. ఆయన ఆదివారం మాట్లాడుతూ.. రేపు విజయవాడలో అంగన్వాడీలు చేపట్టనున్న ధర్నా నేపథ్యంలో స్పందిస్తూ రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ వారి సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తామని ఎమ్మెల్యే తెలిపారు.