సైబర్ నేరాలపై అవగాహన నిర్వహించిన సీఐ

VZM: గ్రామాలలో గంజాయి నియంత్రణకు పటిష్ఠమైన చర్యలు చేపడుతున్నామని గజపతినగరం సీఐ జీఏవీ రమణ తెలిపారు. గురువారం సాయంత్రం మెంటాడ మండలం చల్లపేటలో గజపతినగరం సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమాన్ని ఆయన నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రధానంగా సైబర్ నేరాలు, మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, రోడ్ సేఫ్టీ,1930 ఆవశ్యకతను వివరించారు.