జమ్మిచేడు రిజర్వాయర్‌లో ఉచిత చేప పిల్లల విడుదల
GDWL: తెలంగాణ ప్రభుత్వం ద్వారా మత్స్యకారుల సంక్షేమం కోసం శనివారం గద్వాల పట్టణంలోని జమ్మిచేడు రిజర్వాయర్‌లో ఉచిత చేప పిల్లలను ఫిష్ డిపార్ట్‌మెంట్ అధికారి షకీలా భాను విడుదల చేశారు. ఈ మేరకు ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వం ఎప్పుడు ప్రజల పక్షాన ఉంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం ప్రెసిడెంట్ వెంకట్ రాములు,జిల్లా ముదిరాజ్ గౌరవ సలహాదారులు లక్ష్మణ్ రాంబో పాల్గొన్నారు.