ఎయిరిండియా సిబ్బందికి పనివేళల మినహాయింపు
పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో అంతర్జాతీయ మార్గాల్లో ప్రయాణించే ఎయిరిండియా సిబ్బందికి కాస్త ఉపసమనం లభించింది. పనివేళల నిబంధనల నుంచి వారికి డీజీసీఏ తాత్కాలికంగా ఏప్రిల్ 30 వరకు మినహాయింపు ఇచ్చింది. ఇరాన్, ఇరాక్ గగనతలాన్ని వినియోగించుకో లేకపోతున్నందున.. ప్రత్యామ్నాయంగా ఈజిప్ట్ మార్గాన్ని ఐరోపా, అమెరికా విమానాల కోసం సంస్థ వాడుతోంది.