VIDEO: ఎత్తిపోతల పథకాన్ని పరిశీలించిన కలెక్టర్ రాజబాబు
BPT: కొరిశపాడు గ్రామంలో ఆదివారం జిల్లా కలెక్టర్ రాజాబాబు పర్యటించారు. గ్రామంలోని ఎత్తిపోతల పథకాన్ని ఆయన పరిశీలించారు. అసంపూర్తిగా మిగిలిన నిర్మాణ పనుల గురించి కలెక్టర్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పలువురు ప్రజలు తమకు రావలసిన నష్టపరిహారం, తదితర అంశాలను కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు. త్వరలోనే సమస్యలు పరిష్కరిస్తానని ఆయన హామీ ఇచ్చారు.