రైతుల సంక్షేమం కోసం కట్టుబడి ఉన్నాం: సీఎం
AP: రైతుల సంక్షేమం కోసం ఎన్డీయే కట్టుబడి ఉందని సీఎం చంద్రబాబు అన్నారు. రైతులకు ఆదాయం పెరగాలంటే ఖర్చులు తగ్గాలని తెలిపారు. రైతులకు 24 గంటల్లో ధాన్యం డబ్బులు జమ చేస్తున్నట్లు వెల్లడించారు. వైసీపీ సర్కార్ పంటల బీమా ప్రీమియం చెల్లించలేదని విమర్శించారు. తాము ప్రీమియం సకాలంలో చెల్లించినట్లు పేర్కొన్నారు. వైసీపీ హయాంలో ప్రాజెక్టుల నిర్వహణ గాలికి వదిలేశారని విమర్శించారు.