పంచాయతీ కార్యదర్శి బాలదొరకు సత్కారం

పంచాయతీ కార్యదర్శి బాలదొరకు సత్కారం

AKP: తామరం గ్రామ సచివాలయంలో విధులు నిర్వహించిన పంచాయతీ కార్యదర్శి బాలదొర బదిలీపై వెళ్తున్న సందర్భంగా గ్రామస్తులు ఆదివారం ఆయనను ఘనంగా సత్కరించారు. తామరం నుంచి మాకవరపాలెంకు బదిలీ అయిన.. ఆయన సేవలను, గ్రామాభివృద్ధికి ఆయన చేసిన కృషిని గ్రామ వైస్ ఎంపీపీ, సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డు సభ్యులు ప్రశంసించారు. ఈ సందర్భంగా ఆయనకు శాలువా, బహుమతులు అందజేశారు.